- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: బస్సులో ‘మైఖేల్ జాక్సన్’ ప్రత్యక్షం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బ్రతికే ఉన్నాడా..? బ్రెజిల్ బస్సులో గ్రీన్ పోలో షర్ట్‌తో ప్రత్యక్షమైన ఆయనను పోలి ఉన్న ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ (Michael Jackson)ను అభిమానులు అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా.. మైఖేల్‌కు సంబంధించిన ఏదో ఓ వార్త సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా బ్రెజిల్‌లో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్కెస్ట్రా, పాప్ కింగ్ అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్రెజిల్ (Brazil)లోని ఓ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గ్రీన్ కలర్ పోలో షర్ట్ వేసుకున్న సదరు వ్యక్తి.. అచ్చం మైఖేల్ జాక్సన్‌లాగే కనిపిస్తుండటమే ఇందుకు కారణం. ముఖ కవళికలు, ముక్కు తీరు, చివరికి మైఖేల్ జాక్సన్ ఐకానిక్ హెయిర్ స్టైల్ సైతం అలాగే ఉండటంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘మైఖేల్ జాక్సన్ బ్రతికే ఉన్నాడా?, బ్రెజిల్ బస్సులో మైఖేల్ జాక్సన్ ఏం చేస్తున్నాడు? అంటూ #coincidence అనే హాష్ ట్యాగ్‌తో ఈ ఫోటోను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
కాగా, ఒకవేళ మైఖేల్ నేటికీ బ్రతికే ఉంటే ఆయన వయసు ఎంత ఉండేదనే లెక్కలను కూడా అభిమానులు తీస్తున్నారు. ఆగస్టు 29, 1958లో జన్మించిన మైఖేల్ జాక్సన్, 2009 జూన్‌లో కన్నుమూశారు. ఆయన బ్రతికి ఉంటే ఈ ఏడాది (2026) ఆగస్టు నాటికి ఆయనకు 67 ఏళ్లు నిండేవి. బస్సులో కనిపించిన వ్యక్తి వయసు కూడా దాదాపు అంతే ఉండటంతో ఈ ఫోటో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా గ్రీన్ పోలో షర్ట్ ధరించిన ఈ గుర్తు తెలియని వ్యక్తి రాత్రికి రాత్రే నెట్టింట్లో ఓ సెలెబ్రెటీగా మారిపోయాడు.






