- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: కత్తి పట్టుకుని వివాహిత హల్‌చల్.. నడిరోడ్డుపై భర్తను చంపేందుకు పరుగు
భర్తను చంపుతానంటూ భార్య కత్తి పట్టుకుని నడిరోడ్డుపై హల్‌చల్ చేసిన ఘటన ఇవాళ వరంగల్ (Warangal) పట్టణంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భర్తను చంపుతానంటూ భార్య కత్తి పట్టుకుని నడిరోడ్డుపై హల్‌చల్ చేసిన ఘటన ఇవాళ వరంగల్ (Warangal) పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన శ్రీకాంత్ (Srikanth), జ్యోత్స్న (Jyotsna) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య జ్యోత్స్నకు తెలిసింది. దీంతో భర్తను నడిరోడ్డుపై పట్టుకుని వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పెనుగులాట జరిగింది.
దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న జ్యోత్స్న, కత్తి తీసుకుని భర్త శ్రీకాంత్‌పై దాడికి యత్నించింది. అది చూసిన అతడు ప్రాణభయంతో రోడ్డుపై పరుగులు పెట్టాడు. అనంతరం సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నాడు. జ్యోత్స్న అక్కడికి వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. లోపల ఉన్న భర్త శ్రీకాంత్ డయల్ 100కు సమాచారం అందజేయడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వారు జ్యోత్స్నకు నచ్చజెప్పి ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ప్రస్తుతం జ్యోత్స్న కత్తి పట్టుకుని భర్తపై దాడికి దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






