VIRAL: జంబలకిడిపంబ సీన్ రిపీట్.. కట్ చేస్తే జరిగింది ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 03:12:16  IST  )

90వ దశకంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ మూవీ అందరికీ గుర్తుండి ఉంటుంది.

VIRAL: జంబలకిడిపంబ సీన్ రిపీట్.. కట్ చేస్తే జరిగింది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: 90వ దశకంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఆడవాళ్లు మగవాళ్లుగాను.. మగవాళ్లు ఆడవాళ్లుగా ప్రవర్తిస్తుంటారు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసి ఆ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ సరికొత్త సంచలనం. కట్ చేస్తే.. రియల్ లైఫ్‌లోనూ అచ్చం అలాంటి ఘటనే ప్రస్తుతం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండల పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొలుకుల గ్రామంలో స్థానిక బత్తుల కుటుంబానికి చెందిన శివగంగు రాజు, నందిని‌ల పెళ్లి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తరతరాలుగా కొనసాగుతోన్న సంప్రదాయం ప్రకారం.. పెళ్లి రోజున వధువు వరుడి దుస్తులు ధరించి వరుడిగా, వరుడు వధువు దుస్తులు ధరించి వధువుగా మారి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అలా చేయడం వల్ల కొత్త జంటకు శుభం కలుగుతుందని గ్రామస్థుల నమ్మకమట. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఈ వింత సంప్రదాయం గ్రామంలోని బత్తుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని వారు తెలిపారు.

Next Story