- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: హర్మూజ్ జలసంధిలో ఫుల్ ట్రాఫిక్.. కళకళలాడుతున్న లైవ్ ‘నేవీ’ రాడార్
హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఏకంగా 105 శాతానికి పెరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మళ్లీ ఫుల్ ట్రాఫిక్‌తో కళకళలాడుతోంది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణంతో మూతపడిన జలసంధి పున:ప్రారంభం కావడంతో, నౌకల రాకపోకలు ఊహించని విధంగా 105 శాతం పెరిగాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి లైవ్ నేవీ రాడార్ వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒమన్ తీసుకున్న కొత్త నిర్ణయం, ఇరాన్ సైనిక బలగాల (IRGC) హెచ్చరికలతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
ఒమన్ కొత్త షిప్పింగ్ కారిడార్.. ఇరాన్ ఫైర్
అయతే, హర్మూజ్ రద్దీని వాడుకుంటూ, ఒమన్ ఓ అడుగు ముందుకు వేసింది. ఇదే ప్రాంతంలో కొత్తగా ఓ ‘షిప్పింగ్ కారిడార్’ను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాత మార్గాలపై ఆధారపడకుండా, తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఒమన్ చేపట్టిన తాజా చర్యపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొత్త కారిడార్‌ను పరోక్షంగా హెచ్చరిస్తూ.. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది.






