- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: ఎరక్కపోయి వచ్చాడు.. ఇరుక్కుపోయాడు..!
అసలు ఆ Thought ఎలా వచ్చిందయ్యా...

దిశ, వెబ్ డెస్క్ : అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అంటే ఇదేనేమో. ఓ వ్యక్తి దొంగతనం కోసం వెళ్లి.. ఆ ఇంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న ఇంటి యజమానులతో పాటు ఇరుగుపొరుగు వారు దొంగ అవస్థ పట్ల అయ్యోపాపం అనుకుంటున్నారు. అందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం రాజస్థాన్ లోని కోటాకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఖటూ శ్యాంజీ గుడికి దర్శనం నిమిత్తం వెళ్లింది. దర్శనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లోకి వచ్చి సేదతీరుదాం అనుకునే సరికి వారికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఓ వ్యక్తి ఇంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కుపోయి కనిపించడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతను అందులో నుంచి బయటపడడానికి నానా తంటాలు పడుతుండడంతో చూసి విస్మయానికి గురయ్యారు. కాసేపటికి తేరుకొని అతడిని అసలెందుకు అందులోకి దూరావని ప్రశ్నించారు. అతను చెప్పిన సమాధానానికి ఒకింత కోపం వచ్చినప్పటికీ.. తరువాత అతని అవస్థను చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో పోలీసులకు కూడా సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నానా తంటాలు పడి.. చివరాకరకు కన్నంలో ఇరుక్కున దొంగను మొత్తానికి ఎలాగో అలా బయటకు లాగారు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. కన్నంలో దూరి దొంగతనానికి యత్నించిన నిందితుడు ఒక పోలీసు అధికారి కారు డ్రైవర్ అట..! అతని పేరు పవన్ కుమార్ అంట.
Read More..






