- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోతీ-కుర్తాల వినూత్న క్రికెట్ టోర్నమెంట్
by Malleboina Mahesh |
ధోతీ-కుర్తాలతో నిర్వహించిన వినూత్న క్రికెట్ టోర్నమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టోర్నమెంట్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో క్రీడలు, సంస్కృతి కలయికగా నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ధోతీ-కుర్తాలతో నిర్వహించిన వినూత్న క్రికెట్ టోర్నమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టోర్నమెంట్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో క్రీడలు, సంస్కృతి కలయికగా నిర్వహించారు. 'అంకుర్ ఖేల్ పరిసర్'లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో క్రీడాకారులు సాధారణ జెర్సీలు, ట్రాక్ ప్యాంట్లు కాకుండా, సంప్రదాయ 'ధోతీ-కుర్తా' ధరించి మైదానంలో క్రికెట్ ఆడుతుండడం చూపరులను ఆకట్టుకుంటుంది. వివిధ వేద పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒకవైపు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే, మరోవైపు భారతీయ సనాతన సంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ వస్త్రధారణలో వీరు ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Next Story






