VIRAL: లవ్ స్టోరీకి ఎండ్‌కార్డ్.. ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడిన మోనాలిసా

by Kema Shiva Kumar |

మహాకుంభ మేళా వైరల్ బ్యూటీ మోనాలిసా భోస్లే తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకున్నారు.

VIRAL: లవ్ స్టోరీకి ఎండ్‌కార్డ్.. ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడిన మోనాలిసా
X

దిశ, వెబ్‌డెస్క్: మహాకుంభ మేళా (Mahakumbha Mela)లో పూసలమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోస్లే (Monalisa Bhosle) అలియాస్ మోని భోస్లే తన చిరకాల మిత్రుడు ఫర్మాన్ ఖాన్‌ (Farman Khan)ను వివాహం చేసుకున్నారు. ఇవాళ కేరళలోని తిరువనంతపురంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. మహారాష్ట్రకు చెందిన నటుడు, మోడల్ అయిన ఫర్మాన్ ఖాన్‌ను మోనాలిసా ప్రేమించి పెళ్లాడారు. వీరిద్దరికీ ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే, వీరి వివాహాన్ని మోనాలిసా కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెను బలవంతంగా మహారాష్ట్రకు తీసుకెళ్లి వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నించడంతో మోనాలిసా పోలీసులను ఆశ్రయించారు. ఆమెకు 18 ఏళ్లు నిండటంతో తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని పోలీసులు రక్షణ కల్పించారు.

ఆలయంలో హిందూ సంప్రదాయం పెళ్లి..

తిరువనంతపురంలోని అరుమనూర్‌ శ్రీ నైనార్ దేవా ఆలయం (Sri Nainar Deva Temple)లో హిందూ సంప్రదాయం ప్రకారం ఫర్మాన్ ఖాన్‌ను, మోనాలిసా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, కుంభమేళాలో మోనాలిసా పూసల దండలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడంతో ఆమె రాత్రికిరాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

Next Story