- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: గోల్ కొట్టిన క్రిస్టియానో రొనాల్డో.. నెట్టింట్లో ‘ఐషో స్పీడ్’ రియాక్షన్ వైరల్
ఫిఫా ప్రపంచకప్‌లో క్రొయేషియాపై రొనాల్డో గోల్ కొట్టడంతో ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ ‘స్పీడ్’ (IShowSpeed) ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)లో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) క్రొయేషియాపై చక్కని ఆటతీరుతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. చివరి వరకు టెన్షన్‌తో సాగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియాపై పోర్చుగల్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ కంటే కూడా గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షించిన అంతర్జాతీయ ప్రముఖ యూట్యూబర్ ‘స్పీడ్’ (IShowSpeed) ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
‘ఐషో స్పీడ్’ షర్ట్ విప్పి హంగామా..
క్రిస్టియానో రొనాల్డోకు వరల్డ్ వైడ్‌గా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో యూట్యూబర్ ‘ఐషో స్పీడ్’కు ఉన్న క్రేజే వేరు. ఎక్కడ రొనాల్డో మ్యాచ్ ఉందంటే చాలు.. అక్కడ అతను వాలిపోతుంటారు. తాజాగా ‘ఐషో స్పీడ్’ క్రొయేషియా, పోర్చుగల్ మ్యాచ్‌కు కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే క్రొయేషియా డిఫెన్స్‌ను చేధిస్తూ క్రిస్టియానో రోనాల్డో చేసిన గోల్ చూసి అతను పిచ్చెక్కిపోయాడు. స్టేడియం అని కూడా చూడకుండా వెంటనే తన షర్ట్ విప్పేసి, సీట్లపైకి ఎక్కి ఎగిరి గంతేస్తూ రొనాల్డో ఐకానిక్ ‘Siuuu’ సెలబ్రేషన్‌ను రీ-క్రియేట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియోలు ‘రొనాల్డో గోల్ - స్పీడ్ రియాక్షన్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






