బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నాగదుర్గ.. నా దృష్టంతా వాటిపైనే ఉందంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ క్రమంలోనే నాగదుర్గకు తెలుగులో ఒక పెద్ద రియాలిటీ షోలో పాల్గొనే బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే, ఆ అవకాశాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ఆమె తాజాగా వెల్లడించారు.

బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నాగదుర్గ.. నా దృష్టంతా వాటిపైనే ఉందంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: ఫోక్ డ్యాన్సర్‌గా ఫుల్ క్రేజ్ రాబట్టుకున్న నాగదుర్గ.. ఇప్పుడు హీరోయిన్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించారు. గతంలో ఓ సినిమా చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయారు. దీంతో మళ్లీ ఫోక్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారారు. ప్రస్తుతం తమిళంలో, ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న ‘లవ్ ఓ లవ్’ సినిమాలో నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో పాటుగా తెలుగులో ‘ఇడుపు కాయితం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన నాగదుర్గ రొమాన్స్ చేయనున్నారు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తుండగా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈచిత్రం టైటిల్‌ చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్టాల్లో పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఈ క్రమంలోనే నాగదుర్గకు తెలుగులో ఒక పెద్ద రియాలిటీ షోలో పాల్గొనే బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే, ఆ అవకాశాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ఆమె తాజాగా వెల్లడించారు. తనకు ఎలాంటి భయం లేకపోయినప్పటికీ.. బిగ్‌బాస్ లాంటి షోకు తాను అస్సలు సెట్ కాననిపించిందని ఆమె చెప్పారు.

తాను చాలా సైలెంట్‌గా ఉంటానని, మొహమాటం కూడా ఎక్కువేనని వివరించారు. ఎవరికైనా నో చెప్పాలన్నా కూడా తాను చాలా ఇబ్బంది పడతానని, తన కంటే ఎదుటివారి భావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు ఎదుటివాళ్లు బాధపడకూడదని ఆలోచిస్తూ, తానే ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని నాగదుర్గ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు రెండు రకాలుగా స్పందించారని నాగదుర్గ తెలిపారు. తాను చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతుంది కాబట్టి.. అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకోలేవని తన తల్లి వారించారని చెప్పారు. కానీ, తన తండ్రి మాత్రం కనీసం రెండు మూడు వారాలైనా ఆ ఇంట్లో ఉంటే టెలివిజన్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతావని సలహా ఇచ్చారని అన్నారు. అయితే, తన తల్లిదండ్రుల మాటలను ఆలోచించుకున్న తర్వాత, ప్రస్తుతానికి తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు నాగదుర్గ స్పష్టం చేశారు. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు వస్తోందని, భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసినట్లుగానే.. ఇండస్ట్రీని కూడా ఏలేస్తుందని అంటున్నారు.

Next Story