- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్, BRS మధ్య బిగ్‌బాస్ షో నడుస్తోంది.. కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య 'బిగ్‌బాస్' షో నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల మధ్య బిగ్‌బాస్ (Bigg Boss)షో నడుస్తోందని ఆయన సెటైర్లు వేశారు. ప్రజలు చాలా విజ్ఞులని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎలిమినేట్ చేసి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు పట్టం కట్టబోతున్నారని బండి సంజయ్ అన్నారు.
ప్రజలు రాష్ట్రంలో జరగుతున్న పొలిటికల్ బిగ్‌బాస్ షోను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని.. తాము డిస్ట్రబ్ చేయకుండా పార్టీ పరంగా అధికారంలోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టామని బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజాయితీ ఏందో అర్ధమైందని.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అవినీతి పాల్పడిన కల్వకుంట్ల కుంటుంబంలో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భార్యభర్తల ఫోన్లు విన్నారని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి.. సిట్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు కాలయయాపన చేస్తారని ప్రశ్నించారు. రెండు పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని, వాళ్ల అవినీతి బండారాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ డ్రామాలను ప్రజలు గమనించారని, ఇక మందుకు వాళ్ల ఆటలు సాగవని బండి సంజయ్ అన్నారు.






