విద్యార్థులు, గ్రామస్థుల కోసం ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

by Jakkula.Mamatha |

విద్యార్థుల గ్రామ ప్రజల రవాణా సౌకర్యం కోసం వారి వినతి మేరకు మేడ్చల్ డిపో మేనేజర్‌తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

విద్యార్థులు, గ్రామస్థుల కోసం ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం
X

దిశ, తూప్రాన్: విద్యార్థుల గ్రామ ప్రజల రవాణా సౌకర్యం కోసం వారి వినతి మేరకు మేడ్చల్ డిపో మేనేజర్‌తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొనయపల్లి పిటి గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ నిర్వహించి అనంతరం విద్యార్థులు గ్రామ ప్రజలు మేడ్చల్‌కి వెళ్లాల్సి ఉండగా సరైన సౌకర్యం లేకపోవడంతో మేడ్చల్ డిపో మేనేజర్‌తో మాట్లాడి కొనయపల్లి నుంచి మేడ్చల్ వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి శుక్రవారం సర్పంచ్ మన్నే కళ్యాణ్ మాజీ వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామస్తులు కలిసి ప్రారంభించారు.

Next Story