- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Laya: జిమ్‌కు వెళ్లడం అయినా మానేస్తాను.. కానీ ఆ పని మాత్రం స్కిప్ చేయను
జిమ్‌కు వెళ్లకపోయినా డాన్స్ రీల్స్ మాత్రం ఎప్పటికీ మాననని లయ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటి లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కెరీర్ మంచి దశలో ఉండగానే వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చిన లయ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. వయసు పెరిగినా తన అందం, ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లయ మాట్లాడుతూ.. "చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా కనిపించేందుకు క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తుంటారు. కానీ పెళ్లి తర్వాత అదే డెడికేషన్‌ను కొనసాగించరు. నేను కూడా పెళ్లి తర్వాత జిమ్‌కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం చాలా వరకు తగ్గించాను. కొత్త బట్టలపై కూడా ఆసక్తి తగ్గిపోయింది. అయితే కొంతకాలం తర్వాత ఎందుకు ఇలా ఉండాలి అనిపించింది. ఎప్పుడూ వ్యాయామం చేస్తూ ఉంటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగానూ ఉండొచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
అందుకే మళ్లీ వ్యాయామాలు చేయడం ప్రారంభించాను. అలాగే డాన్స్ చేస్తూ రీల్స్ రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా కారణంతో జిమ్‌కు వెళ్లడం మానేసినా, డాన్స్ రీల్స్ చేయడం మాత్రం ఎప్పటికీ మానను. ఎందుకంటే డాన్స్ చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. అదే సమయంలో మంచి వ్యాయామం చేసిన ప్రయోజనం కూడా లభిస్తుంది. దీంతో ఫిట్‌గా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. అందుకే నేను డాన్స్ వీడియోలు చేయడాన్ని ఎప్పుడూ కొనసాగిస్తాను" అని లయ చెప్పుకొచ్చారు.






