అంతా ఒప్పుకున్నాక... మళ్లీ ఇదేంది?: జగన్ మతిస్థిమితంపై సీఎం మండిపాటు

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతిని అందరూ ఒప్పుకున్న తర్వాత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు..

అంతా ఒప్పుకున్నాక... మళ్లీ ఇదేంది?: జగన్ మతిస్థిమితంపై సీఎం మండిపాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Cm Chandrababu)ని అందరూ ఒప్పుకున్న తర్వాత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) మాట తప్పారని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మండిపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్(Jindal Steel Plant) నిర్మాణ తొలిదశ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. 2014లో అమరావతి అన్నారని, 2019లో మూడు రాజధానులు అంటూ డ్రామాల చేశారని, నిన్న, మొన్నటి వరకూ మావిగన్ అన్నారని, ఇప్పుడే విజయవాడ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజధానిపై జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ జగన్ రాష్ట్రాభిమానంతో ఆటలు ఆడుకోవడం దురదృష్ణకరమని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులంటూ ఏపీ పేరు వింటేనే నవ్వుకునే పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అందరూ గర్వపడేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు గట్టిగా చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ తయారైందని, ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరిరోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Next Story