- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులపై మంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ.. ప్రెస్‌క్లబ్‌కు జూపల్లి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాము చేసిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ ద్వారా తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాము చేసిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. తాను మొదటి నుంచీ ఇదే చెప్తున్నానని, అసెంబ్లీలో సైతం ఈ విషయాన్నే చెప్పానన్నారు. కానీ.. కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాలనలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. తాము చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు ఎక్కడికి రావడానికైనా సిద్ధమని మరోసారి మంత్రి జూపల్లికి తెలిపారు. తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉంటానన్నారు. అప్పులపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా కాంగ్రెస్ నేతల తీరు మారకపోవడం శోచనీయమన్నారు.
గతంలో అసెంబ్లీ నిర్వహించిన సమయంలో.. అప్పటి వరకూ రూ.3.47 లక్షల కోట్ల అప్పు తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఎంత చెప్పినా.. జూపల్లి తీరు పూటకో సవాల్.. రోజుకో అడ్రస్ లా ఉందని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు.
ప్రెస్ క్లబ్ కు మంత్రులు
కాగా.. అప్పులపై చర్చించేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని, తనదే తప్పని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పులపై చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావులు ప్రెస్ క్లబ్ కు రావాలని మంత్రి డిమాండ్ చేశారు. మరి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు అక్కడికి వస్తారా? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.






