సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జోన్-7 జోగులాంబ డీఐజీ

by Kodari Anjali |   (  Updated:2026-07-03 13:20:18  IST  )

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామ పర్యటన నేపథ్యంలో భద్రతా, ఇతర ఏర్పాట్లను జోన్-7 జోగులాంబ డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జోన్-7 జోగులాంబ డీఐజీ
X

దిశ, మిడ్జిల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామ పర్యటన నేపథ్యంలో భద్రతా, ఇతర ఏర్పాట్లను జోన్-7 జోగులాంబ డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్ గారు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకల మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం డీఐజీ శ్రీ ఎల్.ఎస్.చౌహాన్, ఐపీఎస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story