- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల ప్రైవేటు భవనంలో కొనసాగుతుండటంతో మరుగుదొడ్ల సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులుఎదుర్కొంటున్నారనే సమాచారంతో నేరుగా పాఠశాలకు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే భవనం యజమానిని పిలిపించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కాస్మోటిక్ ఛార్జీలను కూడా...
వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, స్నానాల కోసం నీటి నల్లాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విద్యార్థులను ఇబ్బందులగు గురిచేస్తే సహించేది లేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ వద్ద సమీకృత (ఇంటిగ్రేటెడ్) పాఠశాల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవిత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాల కిట్లను పంపిణీ చేశారు.






