సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు కస్టడీకి బ్రేక్

by Vemula.Srinu Prasad |

విజయవాడలో లాకప్ డెత్‌కు గురైన సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి బ్రేక్ పడింది. కస్టడీ విచారణ నిబంధనల్లో మార్పు చేయాలని హైకోర్టును సిట్ కోరింది..

సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు కస్టడీకి బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో లాకప్ డెత్‌కు గురైన సాయికృష్ణ కేసు(Saikrishna Case)లో సీఐ నాగరాజు(CI Nagaraju) కస్టడీ(Custody)కి బ్రేక్ పడింది. కస్టడీ విచారణ నిబంధనల్లో మార్పు చేయాలని హైకోర్టు(High Court)ను సిట్(SIT) కోరింది. సిట్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సిట్ కస్టడీ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ

కాగా ఈ కేసులో సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కేసులో మరింత విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే రెండో ఏసీఎమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సాయికృష్ణను 9 రోజుల కస్టడీకి అనుమతించింది. శుక్రవారం కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కస్టడీ విచారణ నిబంధనల్లో మార్పు చేయాలని హైకోర్టులో సిట్ అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే సీఐ నాగరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే నాగరాజు మాత్రం ఈ కేసులో సిట్ ఇరికిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు కస్టడీపై ఉత్కంత నెలకొంది.

Next Story