- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన దర్శకుడు
దర్శకుడు అజయ్ భూపతి సినిమా విడుదల వాయిదా పడినట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ట్విట్టర్ ద్వారా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

దిశ, సినిమా: ఆర్‌ఎక్స్-100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో కొత్త వారసుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడైన జయకృష్ణ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు.
అయితే ఈ చిత్రం జూలై 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వార్తలను నిజం చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి సినిమా విడుదల వాయిదా పడినట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ట్విట్టర్ ద్వారా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో వెండితెరపై అత్యంత గాఢమైన ప్రేమకథ చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. విడుదల చేసిన పోస్టర్‌లో హీరో జయకృష్ణ, హీరోయిన్ రాషా తడాని ఒక కొండపై నిల్చుని, చుట్టూ మబ్బులు కమ్ముకున్న వేళ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






