కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ బచావో.. గాంధీభవన్ ముందు కార్యకర్తల ఆందోళన

by Ajay Maddhiboyina |

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ పార్టీకి బచావో అంటూ నియోజకవర్గంలోని దాదాపు వందమంది కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టారు.

కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ బచావో.. గాంధీభవన్ ముందు కార్యకర్తల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ పార్టీకి బచావో అంటూ నియోజకవర్గంలోని దాదాపు వందమంది కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా, కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడంలేదని అన్నారు. గత ప్రభుత్వంలో భుజాలు కాయలుకాసినా కాంగ్రెస్ పార్టీ జెండాను మోశామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక నిర్భంధాలు, రౌడీ షీట్ కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

ఎన్నో దాడులు చేశారని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై నమ్మకం ఉందని యాదయ్యను పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వారికి ఏం సమాచారం ఇస్తున్నాడో కానీ పార్టీ కండువా కప్పుకోవడం లేదని అన్నారు. ఇదిలా ఉంటే కాలె యాదయ్య గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరవాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగలు తగులుతున్నాయి.

Next Story