- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్లిక్ టాయిలెట్ స్థలంలో అక్రమ నిర్మాణం అనుమతులు రద్దు చేసిన మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్
డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులకు అనుమతి రద్దు పత్రాలను శాంతి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

దిశ, అల్వాల్: తప్పుడు పత్రాలతో అనుమతి పొందినట్లు నిర్ధారణ టెంపుల్ అల్వాల్‌లోని H.No. 1-9-62/5 ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఎన్.బి.ఎన్. కిషోర్, ఎన్. శిరీషలకు ఇచ్చిన బిల్డింగ్ అనుమతులను మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ రద్దు చేశారు. టీపీసీసీ ప్రతినిధి ఏ. అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు, 420 గజాల ఈ స్థలం గ్రామ కంఠం భూమి అని, గతంలో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు, ప్రభుత్వ హ్యాండ్ పంపు ఉండేవని గుర్తించారు. ఫిర్యాదుదారు సమర్పించిన ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్‌లో పశ్చిమ సరిహద్దులో పబ్లిక్ మరుగుదొడ్లు అని స్పష్టంగా ఉంది. మండల సర్వేయర్ మ్యాప్‌లోనూ ఇది గ్రామకంఠం భూమిగా నమోదై ఉంది. పాత ఫొటోల్లో సెప్టిక్ ట్యాంకులో గేదెలు పడిన దృశ్యాలు, ప్రభుత్వ హ్యాండ్ పంపు, ఆల్వాల్ మున్సిపాలిటీ బోర్డు ఆధారాలుగా లభించాయి. కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయ వివాదాస్పద స్థలం అల్వాల్ విలేజ్‌లో 420 గజాలు ఫిర్యాదారుడు ఏ. అశోక్ కుమార్, టీపీసీసీ ప్రతినిధి చేసిన ఆరోపణలు నిజమని తేలాయి. వాస్తవాలు దాచి పెట్టి పబ్లిక్ టాయిలెట్ స్థలంలో బిల్డింగ్ పర్మిషన్ పొందారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై..
జోనల్ అధికారి ఉత్తర్వు ఆర్డర్ No. 145/TPS/C02/Mkj-Zone/MMC/2026, తేదీ 30.06.2026 రద్దయిన అనుమతులు 29.03.2025 నాటి వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్, 11.02.2026 నాటి రివిజన్ పర్మిషన్ దరఖాస్తుదారులు 2016 కంటే ముందు టైటిల్ పత్రాలు సమర్పించలేదని, 1979 నాటి O.S. No. 121 of 1976 ప్రకారం.. భూమి విస్తీర్ణం 3.20 గుంటలు కాగా కేవలం 450 గజాలకు మాత్రమే హక్కు కోరుతున్నారని, దీనికి సరైన ధ్రువీకరణ అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. సమర్పించిన 1968 నాటి లింక్ డాక్యుమెంట్ క్లీన్గా లేదని తేల్చారు. పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు దాచి అనుమతులు పొందినందున ఎన్.బి.ఎన్. కిషోర్, ఎన్. శిరీషలకు ఇచ్చిన నిర్మాణ అనుమతులు రద్దు చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకున్న మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్‌కు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ నాయకులు పి. సురేందర్ రెడ్డి, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై ఇలాగే కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా రద్దు పత్రాలను డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరలకు అందజేశారు.






