- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందమైన నవ్వుతో.. స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేసిన మిథిలా పాల్కర్
గోల్డ్ కలర్ చీరలో క్యూట్ స్మైల్, సొగసైన లుక్‌తో ఆకట్టుకున్న మిథిలా పాల్కర్.

దిశ, వెబ్ డెస్క్: అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి మిథిలా పాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2014లో విడుదలైన మరాఠీ షార్ట్ ఫిల్మ్ 'మాఝా హనీమూన్' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ, అనంతరం మరాఠీతో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక 2022లో విడుదలైన 'ఓరి దేవుడా' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మిథిలాకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగా కనిపించే మిథిలా సోషల్ మీడియాలో మాత్రం తన స్టైలిష్ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తూ వస్తుంది.
తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. గోల్డ్ కలర్ చీరకు మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన ఆమె తన ఎద మరియు నడుము అందాలతో ఆకట్టుకుంది.
సొగసైన ఆభరణాలు, మెడలో భారీ హారం, చేతికి బ్రేస్‌లెట్, ముఖంపై అందంగా జారిన కురులు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. క్యూట్ స్మైల్‌తో మిథిలా ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఫిదా చేస్తున్నాయి.
Photos Courtesy: Instagram






