ఉద్యమకారుని వినూత్న నిరసన.. రోడ్ల నిర్మాణం చేపట్టాలని భిక్షాటన

by Taduka Kalyani |

కుబీర్ మండలంలో పాడైన రహదారులను వెంటనే నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ వినూత్న నిరసన చేపట్టారు.

ఉద్యమకారుని వినూత్న నిరసన.. రోడ్ల నిర్మాణం చేపట్టాలని భిక్షాటన
X

దిశ,బైంసా : కుబీర్ మండలంలో పాడైన రహదారులను వెంటనే నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. మండల వ్యాప్తంగా భిక్షాటన నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టిని సమస్యపై ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని రహదారులు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షాటన చేస్తూ, "కేసీఆర్ పోయినా రోడ్లు రాలేదు.. రేవంత్ రెడ్డి వచ్చినా రోడ్లు రాలేదు.. విఠల్ రెడ్డి ఉన్నా రోడ్లు రాలేదు.. రామారావు పటేల్ వచ్చినా రోడ్లు రాలేదు" అంటూ తన నిరసనను వ్యక్తం చేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును రోడ్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం, అధికారులకు విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారులు మరింత దెబ్బతిని ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. కొత్తూరు శంకర్ చేపట్టిన ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు కూడా రహదారుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story