- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. స్కూళ్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ విక్రయాలపై నిషేధం
మహారాష్ట్రలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌పై ఆంక్షలు.. స్కూళ్లకు 500 మీటర్ల పరిధిలో విక్రయాలు నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ఎఫ్‌డీఏ మంత్రి!

దిశ, వెబ్ డెస్క్: పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో అమిత ప్రజాదరణ పొందిన ‘స్టింగ్’ (Sting) ఎనర్జీ డ్రింక్ పిల్లలకు హానికరమని తేలింది. దీంతో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై రాష్ట్రవ్యాప్తంగా నియంత్రణలు విధించబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు (Schools) 500 మీటర్ల పరిధిలో ఈ ఎనర్జీ డ్రింక్ విక్రయాలను పూర్తిగా నిషేధించనున్నట్లు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (FDA) శాఖ మంత్రి నరహరి జిర్వాల్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
ఈ ఎనర్జీ డ్రింక్‌లో కేఫీన్ (Caffeine), చక్కెర శాతాలు అధికంగా ఉండటం వల్ల, దీనిని నిరంతరం వినియోగించడం చిన్న పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యార్థులను ఈ తరహా డ్రింక్స్‌కు దూరంగా ఉంచేందుకు త్వరలోనే అధికారిక జీవో జారీ చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






