- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ హయాంలో పేదల సొంతింటి కల సాకారం
by Ratna Kumari |
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు.

X
దిశ, ఎల్లారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్‌లో దూరంగారి సిద్దుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికాగా, గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ .. అర్హులైన పేద కుటుంబాలు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందేలా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్ రామగళ్ల లక్ష్మి, తిరుపతి, శివానందం, కో-ఆప్షన్ సభ్యుడు వసీం, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Next Story






