- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానికి అమరావతి నేల పనికిరాదు: సజ్జల సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజధానిపై మళ్లీ కన్య్ఫూజన్ నెలకొంది. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చట్టబద్ధత చేసి అభివృద్ధి చేస్తోంది. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం గందరగోళ కామెంట్స్ చేస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital)పై మళ్లీ కన్య్ఫూజన్ నెలకొంది. కూటమి ప్రభుత్వం అమరావతి(Amaravati)ని రాజధానిగా చట్టబద్ధత చేసి అభివృద్ధి చేస్తోంది. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Ycp Chief Jagan Mohan Reddy) మాత్రం గందరగోళ కామెంట్స్ చేస్తున్నారు. తొలుత మూడు రాజధానులు అని, ఆ తర్వాత మావిగన్ అని, తాజాగా విజయవాడ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. దీంతో ప్రజల్లో అమరావతిపై ఆందోళన నెలకొంది.
సజ్జల వ్యాఖ్యలతో మరింత గందరగోళం
ఇదిలా ఉంటే ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Ycp Leader Sajjala Ramakrishna Reddy) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనలను మరింత పెంచాయి. రాజధానికి అమరావతి నేల పనికిరాదంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఖర్చుపెట్టాల్సిన చోట రూ.10 రూపాయలు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని త్వరగా పూర్తి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. రాజధాని అమరావతి పేరు చెప్పి ఎన్ని కోట్లైనా దోచుకోవచ్చన్నారు. ఈ దోపిడీపై విమర్శలు చేస్తున్నారనే జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుంభకోణాలకు చంద్రబాబు బ్లూప్రింట్ రూపొందించారని ఎద్దేవా చేశారు. ఏమాత్రం స్పృహ ఉన్నా రాజధానిపై ఈ విధంగా ఖర్చు చేయరన్నారు. అమరావతిలో 10% నిధులతో మావిగన్ అభివృద్ధి చేయొచ్చని సజ్జల స్పష్టం చేశారు.
రూ.47వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం
కానీ అమరావతి పేరుతో ఇప్పటికే రూ.47వేల కోట్లు అప్పు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఇదే డబ్బులతో రాష్ట్రంలో అనేక పనులు చేయొచ్చని సలహా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండేళ్లవుతోందని, మొత్తం ఇప్పటివరకూ రూ.3లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. కానీ భూములివ్వని రైతులను మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఇవ్వాల్సిన భూముల చుట్టూ గుంతలు తవ్విస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల సీఎం చంద్రబాబు సినిమాల్లో విలన్‌లా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.






