కేజీబీవీ జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..

by Kodari Anjali |

కేజీబీవీ జూనియర్ కాలేజీలో సీఈసీ గ్రూపులో 20 సీట్లు, ఎంపీ హెచ్‌డబ్ల్యూ గ్రూప్‌లో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కేజీబీవీ జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..
X

దిశ, చిట్యాల: మండలంలోని కేజీబీవీ జూనియర్ కాలేజీలో సీఈసీ గ్రూపులో 20 సీట్లు, ఎంపీ హెచ్‌డబ్ల్యూ గ్రూప్‌లో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయి. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, ఈ నెల ఆరో తారీఖున కళాశాలకు వచ్చి నేరుగా స్పాట్ అడ్మిషన్ పొందగలరని, ఎస్ ఓ సుమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో చిట్యాల కేజీబీవీ ఐఓఈగా సెలెక్ట్ కావడం జరిగిందని, దీనిలో భాగంగా క్లాట్(clat), లా సెట్ ప్రవేశ పరీక్షలకు సీఈసీ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కేజీబీవీ ఎస్ ఓ తెలిపారు.

Next Story