- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్
ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా డిజిటలైజేషన్ నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.

దిశ, వంగూర్: మండల పరిధిలోని వెలమలపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 20వ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ చెనమోని మల్లేష్ ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నింపిన దరఖాస్తుల స్వీకరణ, వివరాల ధ్రువీకరణ, డిజిటలైజేషన్ తదితర కార్యక్రమాల పురోగతిని స్వయంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామంలో 348 మంది ఓటర్లకు 100% పంపిణీ చేసినట్లు ఐదుగురి ఓటర్ల వివరాలను ఆన్లైన్ ప్రక్రియలు నమోదు చేసినట్లు తెలిపారు. మండల పరిధిలో ఉన్న 33,395 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 90% పంపిణీ ప్రక్రియ పూర్తి చేసినట్లు తాహసీల్దార్ కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), సూపర్‌వైజర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్క ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రతి అధికారిపై ఉన్న బాధ్యత అని అన్నారు. గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించి, ఓటర్లు నింపిన ఫారాలను నిర్ణీత గడువులోగా తిరిగి స్వీకరించాలని సూచించారు. అనంతరం వాటిలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఓటరు వివరాల నమోదు సమయంలో పేర్లు, చిరునామాలు, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, అవసరమైన గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని, చిన్నపాటి తప్పిదాలు కూడా భవిష్యత్తులో సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
ప్రతి బూత్ పరిధిలో...
అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపో కుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లను మరోసారి సంప్రదించి వారి నుంచి ఫారాలు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురైతే బీఎల్‌వోలు వారికి సహాయం చేయాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో రోజువారీ పురోగతిని సూపర్ వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలు, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ మురళీ మోహన్, డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి,సెక్రటరీ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ రామస్వామి, మాజీ సర్పంచ్ లింగయ్య, నాయకులు సైదులు, ఆంజనేయులు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.






