- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్ మార్కండేయ ఆలయంలో చోరీ.. రెండు హుండీల నగదు అపహరణ!
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ మార్కండేయ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కలకలం సృష్టించాడు.

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ మార్కండేయ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కలకలం సృష్టించాడు. గురువారం రాత్రి పూజల అనంతరం ఆలయం మూసి వేయగా, శుక్రవారం ఉదయం పూజారి వచ్చేసరికి చోరీ ఘటన వెలుగుచూసింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మార్కండేయ దేవాలయంలోని రెండు హుండీలను పగలగొట్టి భక్తుల కానుకల నగదు మొత్తాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. అలాగే అదే ఆలయ ప్రాంగణంలో గల అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఖాళీగా ఉన్న హుండీ పగలగొట్టి నగదు కోసం వెతికాడు. హుండీలు పగిలి ఉండటాన్ని చూసిన పూజారి వెంటనే ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సదానందం సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. ఆలయ సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. అర్ధరాత్రి ఒక వ్యక్తి లోపలికి చొరబడి హుండీలను తీసుకొని పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై పద్మశాలి పట్టణ అధ్యక్షులు వెల్దండి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, వేలిముద్రల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రముఖ ఆలయ ప్రాంగణంలో చోరీ జరగడంతో స్థానిక భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






