జమ్మలమడుగులో సరికొత్త చరిత్ర.... జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-03 08:04:52  IST  )

రాయలసీమలో సరికొత్త చరిత్రకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జమ్మలమడుగు పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగు పడింది..

జమ్మలమడుగులో సరికొత్త చరిత్ర.... జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ(Rayalaseema)లో సరికొత్త చరిత్రకు కూటమి ప్రభుత్వం(Nda Government) శ్రీకారం చుట్టింది. జమ్మలమడుగు(Jammalamadugu) పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగు పడింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చేతుల మీదుగా రాయలసీమ స్టీల్‌ప్లాంట్(Rayalaseema Steel Plant) నిర్మాణ పనులు జమ్మలమడుగులో ప్రారంభమయ్యాయి. ఈ స్టీల్ ప్లాంట్‌ను వార్షికంగా 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్లాంట్ నిర్మాణాన్ని మొత్తం రెండు విభిన్న దశల్లో పూర్తి చేయనున్నారు.

రూ. 4,500 కోట్ల భారీ వ్యయంతో తొలి దశ నిర్మాణం


తొలి దశ నిర్మాణాన్ని రూ. 4,500 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు. ఈ తొలి విడతలో 1 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన యూనిట్‌ను నిర్మించనున్నారు. రాబోయే రెండేళ్ల కాలంలోనే ఈ తొలి దశ పనులను పూర్తి చేయనున్నారు. తద్వారా సుమారు 1,000 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆ తర్వాత రూ. 11,850 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించనున్నారు.

మరో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంపు

ఈ దశలో మరో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. తద్వారా అదనంగా మరొక 1,500 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు దశలు పూర్తి అయితే 2,500 మందితో పాటు వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీంతో రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాల కల్పనలో ఈ పరిశ్రమ కీలక భూమిక పోషించనుంది.

Next Story