ప్రమాదవశాత్తు పెట్రోల్ బంక్‌లో మంటలు

by Jakkula.Mamatha |

పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు పెట్రోల్ బంక్‌లో మంటలు
X

దిశ, షాద్ నగర్: పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బెంగళూరు- హైదరాబాద్ 44వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం సాయి బాలాజీ హిందుస్థాన్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బంకులో పెట్రోలు పోయించుకునేందుకు వచ్చిన కారులో పెట్రోల్ పోసిన అనంతరం సిబ్బంది పెట్రోల్ గన్‌ను తొలగించకపోవడంతో గమనించని కారు యజమాని ముందుకు వెళ్లి పోయారు. ఈ క్రమంలో కారు నుంచి పెట్రోల్ గన్ కిందపడి రాపిడికి గురై మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పెట్రోల్ గన్ రాపిడికి గురవడం, ఎర్తింగ్ వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చారు.

Next Story