ఓటీటీలోకి రాబోతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |

ఇప్పుడు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ఓటీటీలోకి రాబోతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్, ఊర్వశి, జయరామ్, సంజన కృష్ణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘పరిమళ అండ్ కో’. ఈ సినిమాలో స్టార్ కమెడియన్ యోగిబాబు, శాండీ, సంతోష్, శోభన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు పండిరాజ్ ఈ సినిమాను ఆసక్తికరమైన కథాంశంతో రూపొందించారుఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక హత్య మిస్టరీలో చిక్కుకున్న మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబంలోని చిన్న కూతురిని వేధిస్తున్న ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. అయితే, ఆ గ్యాంగ్‌స్టర్ చనిపోయాడనే వార్త బయటకు రాగానే.. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడం మొదలుపెడతారు.

అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఆ కుటుంబానికి, గ్యాంగ్‌స్టర్‌కు మధ్య ఉన్న అసలు వైరమేంటి? ఆ సమస్య నుండి వారు ఎలా బయటపడ్డారు? అనే అంశాలను దర్శకుడు పండిరాజ్ కాస్త కామెడీ, మరికొంత సస్పెన్స్‌ జోడించి చూపించారు. అయితే జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను రాబట్టుకుంది. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు సొంతం చేసుకుంది. జూలై 10 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది.

Next Story