- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్య
న్యూయార్క్ ఐరాస కార్యాలయం వెలుపల టిబెట్ నిరసనకారుడు లాబ్గా రంగ్జెన్ సజీవ దహనం.. చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆత్మహత్య!

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ దౌత్యానికి కేంద్రమైన న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యాలయం వెలుపల భయానక ఘటన చోటుచేసుకుంది. చైనా నుంచి టిబెట్‌కు విముక్తి కల్పించాలనే డిమాండ్‌తో లాబ్గా రంగ్జెన్ (52) అనే టిబెట్ నిరసనకారుడు బహిరంగంగా ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తూ ఉబెర్ (Uber) డ్రైవర్‌గా పనిచేస్తున్న రంగ్జెన్.. సాంప్రదాయ బౌద్ధ సన్యాసి వస్త్రాలు ధరించి ఐరాస భవన సముదాయం వద్దకు చేరుకున్నాడు. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి, టిబెట్ స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేస్తూ రోడ్డుపై టిబెట్ జెండాను ఉంచి, తనను తాను తగులబెట్టుకున్నాడు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది 15 సెకన్లలోనే మంటలను ఆర్పివేసి, తీవ్రంగా గాయపడిన రంగ్జెన్‌ను చికిత్స నిమిత్తం బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) ధృవీకరించింది. ఘటనా స్థలంలో "చైనా అవుట్ ఆఫ్ టిబెట్" (టిబెట్ నుండి చైనా తప్పుకోవాలి) అని రాసి ఉన్న కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త జాతి ఐక్యత చట్టాలు టిబెటన్ల హక్కులను కాలరాస్తున్నాయని, దీనిపై నిరసనగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తోటి టిబెట్ పౌరులు తెలిపారు. ఐరాస సమావేశాలన్నీ ముగిసిన తర్వాత ఈ ఘటన జరగడంతో సమితి విధులకు ఎలాంటి అంతరాయం కలగలేదు.






