- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి గల్లంతైన నవ వరుడు మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.

దిశ, రెబ్బెన: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానిక ఎస్సై సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలానికి చెందిన దినేష్(26) గురువారం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు, గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో దినేష్ మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, దినేష్‌కు ఈ ఏడాది మే 26న లింగిగూడ గ్రామ ఉప సర్పంచ్ కవితతో వివాహం జరిగింది. పెళ్లయి నెల రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.






