సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కోర్టుకు లేఖ రాసిన సీఐ నాగరాజు

by Malleboina Mahesh |

సాయికృష్ణ కేసులో సిట్ తనను అన్యాయంగా ఇరికిస్తోందంటూ విజయవాడ కోర్టుకు లేఖ రాసిన సీఐ నాగరాజు.. విచారణ న్యాయవాదుల సమక్షంలో జరపాలని విజ్ఞప్తి!

సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కోర్టుకు లేఖ రాసిన సీఐ నాగరాజు
X

దిశ, వెబ్ డెస్క్: సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజు (CI Nagaraju) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను 8 రోజుల పాటు విచారించేందుకు సిట్ (SIT) అధికారులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. సీఐ నాగరాజు విజయవాడ కోర్టుకు ఒక సంచలన లేఖ రాశారు. సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

అలాగే సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారని సీఐ నాగరాజు ఆరోపించారు. కస్టడీ విచారణ సమయంలో అధికారులు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా (టార్చర్ చేయకుండా) తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని వేడుకున్నారు. అంతేకాకుండా, సిట్ అధికారులు జరిపే విచారణ ప్రక్రియ అంతా తన న్యాయవాదుల (Advocates) సమక్షంలోనే జరిగేలా చూడాలని ఆయన లేఖలో అభ్యర్థించారు. సిట్ అధికారులే తనను వేధిస్తున్నారని నిందితుడైన సీఐ కోర్టు కు లేఖ రాయడం విజయవాడ పోలీస్ సర్కిల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది.

Next Story