- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను ముద్దు పేర్లతో పిలిచేది వాళ్ళు మాత్రమే.. అసలు సీక్రెట్ బయటపెట్టిన త్రిష
'హనీ', 'ట్రాష్' అనే ముద్దుపేర్లు తనకి ఉన్నట్లు త్రిష చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎన్నో సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న నటీమణుల్లో త్రిష ఒకరు. ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ వరుస అవకాశాలు అందుకుంటూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్రిష మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమలో హీరోయిన్లను ముద్దు పేర్లతో పిలవడం సాధారణమే.
అయితే త్రిషను ఎక్కువగా అందరూ ఆమె అసలు పేరుతోనే పిలుస్తుంటారు. కానీ తనకు రెండు ముద్దు పేర్లు ఉన్నాయని, వాటితో కొద్దిమంది మాత్రమే పిలుస్తారని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్రిష మాట్లాడుతూ... "నాకు 'హనీ', 'ట్రాష్' అనే రెండు ముద్దు పేర్లు ఉన్నాయి. 'హనీ' అని మా అమ్మ తప్ప ఇంకెవరూ పిలవరు. అమ్మ అలా పిలవడం నాకు కూడా చాలా ఇష్టం. ఇక 'ట్రాష్' అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఆ పేరు పెట్టారు. ఇప్పటికీ వాళ్లు అలా పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఈ రెండు ముద్దు పేర్లు ఉన్నా, వాటితో నన్ను చాలా తక్కువ మంది మాత్రమే పిలుస్తారు" అని చెప్పుకొచ్చింది.






