ఎన్నికల విధుల్లో జోక్యం.. సర్పంచ్‌పై చర్యలు కోరిన బీఎల్‌వోలు

by Ratna Kumari |

ఎస్‌ఐఆర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో గ్రామ సర్పంచ్ భూక్య నారాయణ విధులకు ఆటంకం కలిగిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మండల బీఎల్‌వోలు శుక్రవారం అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

ఎన్నికల విధుల్లో జోక్యం.. సర్పంచ్‌పై చర్యలు కోరిన బీఎల్‌వోలు
X

దిశ, అనంతగిరి : మండలంలోని పాలారం తండా బీఎల్‌వో భూక్య విజయ ఎన్నికల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) విధులు నిర్వహిస్తున్న సమయంలో గ్రామ సర్పంచ్ భూక్య నారాయణ విధులకు ఆటంకం కలిగిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మండల బీఎల్‌వోలు శుక్రవారం అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రం అందజేసి, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన బీఎల్‌వోలను బెదిరించడం, దుర్భాషలాడడం, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం వంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను వేధించే వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, అవసరమైతే నాన్‌బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్‌ఐఆర్ విధులను ఎలాంటి ఒత్తిళ్లు, జోక్యాలు లేకుండా నిర్వహించేలా బీఎల్‌వోలకు భద్రత కల్పించాలని, పాలారం తండా సర్పంచ్ భూక్య నారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Next Story