నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు..

by Kodari Anjali |

వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా అక్రమ తయారీపై సోదాలు నిర్వహించారు.

నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ తయారీపై సోదాలు చేపట్టారు. మహబూబాబాద్ మండలంలోని శనిగపురం తండా, బోడ గుట్ట తండా, నడివాడ, గడ్డి గూడెం తండా, అనంతారం గ్రామాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో (03) గురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి, (17) లీటర్ల నాటుసారా & (10) కిలోల పటిక స్వాధీనం చేసుకొని (1200) లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసుకున్నారు. తర్వాత ముద్దాయిలను తాహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఇట్టి దాడులలో ఎక్సైజ్ సీఐ లు చిరంజీవి, నాగేశ్వరరావు, నీరజ, చంద్రశేఖర్, ఎక్సైజ్ ఎస్సై లు కిరీటి, మౌనిక హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ లు సంపూర్ణ, గోపి & బలరాం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story