- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా విమానం కాక్‌పిట్‌లో హనుమంతుడి దర్శనం
ప్రపంచ యూట్యూబర్ స్పీడ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ యూట్యూబర్ స్పీడ్(IShowSpeed) పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ విమానం కాక్‌పిట్‌లో భారతీయుల ఆరాధ్య దైవం హనుమంతుడి విగ్రహం కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ అంతర్జాతీయ యూట్యూబర్, గ్లోబల్ కంటెంట్ క్రియేటర్ స్పీడ్ ప్రయాణిస్తున్న అమెరికన్ ప్రైవేట్ జెట్ విమానంలో ఈ ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది.
తప్పిన భారీ విమాన ప్రమాదం
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్పీడ్ ఈ జెట్‌లో ప్రయాణిస్తుండగా, విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్ ముందు భాగంలోని విండ్‌షీల్డ్ స్వల్పంగా బ్రేక్ కావడటంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ఐషోస్పీడ్‌తో పాటు సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాక్‌పిట్‌లో హనుమాన్ దర్శనం
విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఉత్కంఠభరిత సమయంలో స్పీడ్ కాక్‌పిట్‌లోకి వెళ్లాడు. అక్కడ విమాన విండ్‌షీల్డ్ ముందు ఒక చిన్న హనుమంతుడి బొమ్మ వేలాడుతూ కనిపించింది. తన మార్క్ హై-ఎనర్జీ స్టైల్‌లో స్పీడ్ ఆ విగ్రహాన్ని ప్రత్యేకంగా కెమెరాలో చూపిస్తూ, దాని ప్రాముఖ్యత గురించి అమెరికన్ పైలట్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఈ దృశ్యాలన్నింటినీ స్పీడ్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
‘జై హనుమాన్’ అంటున్న నెటిజన్లు
ఈ వీడియోపై ముఖ్యంగా భారతీయ నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. అమెరికా విమానం కాక్‌పిట్‌లో హనుమంతుడు కొలువై ఉండటం వల్లే ఇంత పెద్ద ప్రమాద ముప్పు నుండి విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందని, వీడియో కింద "జై హనుమాన్", "బజరంగ్ బలియే కాపాడారు" అంటూ వేలాదిగా కామెంట్లు పెడుతున్నారు. గ్లోబల్ స్టార్ వీడియోలో ఆంజనేయస్వామి బొమ్మ కనిపించడంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.






