వార్డెన్ హేమ సేవకు సలామ్.. సత్కరించిన మంత్రి

by Ajay Maddhiboyina |

మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజ‌న బాలిక‌ల సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల బాలిక ప్రాణాల‌ను కాపాడిన వార్డెన్ హేమ‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స‌త్క‌రించారు. ఆమె చూపిన అసాధార‌ణ మాన‌వ‌త్వాన్ని, నిబ‌ద్ధ‌త‌ను అభినందించారు.

వార్డెన్ హేమ సేవకు సలామ్.. సత్కరించిన మంత్రి
X

దిశ‌, వెబ్ డెస్క్: మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజ‌న బాలిక‌ల సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల బాలిక ప్రాణాల‌ను కాపాడిన వార్డెన్ హేమ‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స‌త్క‌రించారు. ఆమె చూపిన అసాధార‌ణ మాన‌వ‌త్వాన్ని, నిబ‌ద్ధ‌త‌ను అభినందించారు. హేమ వ‌య‌సు చిన్న‌దే అయినా ఏడ‌వ త‌ర‌గ‌తి అమ్మాయిని మోసుకురావ‌డం గొప్ప విష‌యం అని అన్నారు. కాగా మ‌న్యం జిల్లా గుమ్మ‌ల ల‌క్ష్మిపురం గిరిజ‌న బాలిక‌ల సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న వాటాక భువ‌నేశ్వ‌రి అనే విద్యార్థిని ఇటీవ‌ల హాస్ట‌ల్ లో అనారోగ్యానికి గురైంది. దీంతో త‌ల్లి దండ్రులు విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే వెళ్లిన త‌ర‌వాత ఆమె ప‌రిస్థితి మ‌రింత క్షీణించ‌డం, గ్రామానికి రోడ్డు మార్గం లేక‌పోవ‌డంతో వార్డెన్ హేమ భువ‌నేశ్వ‌రి ఇంటికి వెళ్లి ఆమెను 6 కి.మీ భుజంపై మోసుకు వ‌చ్చి ఆస్ప‌త్రిలో చేర్చించింది. వార్డెన్ హేమ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం, మీడియాలో వార్త‌లు రావ‌డంతో ఆమె చేసిన ప‌నికి చాలా మంది అభినందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా మంత్రి సంధ్యారాణి ఆమెను స్థానిక‌ అధికారుల‌తో స‌త్కరించారు.

Next Story