- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐ నాగరాజు కస్టడీ కేసు.. విచారణ నిబంధనల్లో మార్పు కోరుతూ సిట్ పిటిషన్
విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును సిట్ కస్టడీకి కోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. ..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పీఎస్(Vijayawada Krishnalanka police station)లో సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు( CI Nagaraju)ను సిట్ కస్టడీ(SIT Custody)కి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన విచారణపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. సీఐ నాగరాజును శుక్రవారం సిట్ కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. అయితే నాగరాజు కస్టడీ విచారణ నిబంధనల్లో మార్పు కోరూతూ సిట్ తాజాగా కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అధికారులు లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది.
రాజమండ్రి జైలు వద్దకు అధికారులు, లాయర్లు
మరోవైపు రాజమండ్రి జైలు వద్దకు సిట్ అధికారులతో పాటు ఇరువర్గాల లాయర్లు చేరుకున్నారు. అయినప్పటికీ సీఐ నాగరాజును కస్టడీ తీసుకోవడంలో సందిగ్ధత నెలకొంది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి అయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసే వరకూ నాగరాజును కస్టడీకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.






