బాలుడు అదృశ్యం.. ఆచూకీ తెలిపాలని పోలీసుల విజ్ఞప్తి

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కున్సోత్ మహేందర్ అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

బాలుడు అదృశ్యం.. ఆచూకీ తెలిపాలని పోలీసుల విజ్ఞప్తి
X

దిశ, పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కున్సోత్ మహేందర్ (13), అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 2 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో "హెయిర్ కటింగ్ చేసుకోవడానికి కిన్నెరసాని సెంటర్‌కు వెళ్తున్నాను" అని తోటి విద్యార్థులకు చెప్పి ఆటోలో వెళ్లిన మహేందర్, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు.

బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహేందర్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి. సురేష్‌ను *8712682053*, *8712682054* నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story