- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనులు చేయడు... బినామీలకు అమ్ముకుంటాడు...
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పరిధిలో పలు అభివృద్ధి పనులు దక్కించుకున్న పక్క జిల్లా కాంట్రాక్టర్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న పక్క జిల్లా కాంట్రాక్టర్ ఖమ్మం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు గుదిబండలా తయారయ్యాడనే విమర్శలు వస్తున్నాయి తోటి కాంట్రాక్టర్లను సైతం తొక్కేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడని ఇతడికి పేరు ఉంది. ట్విస్ట్ ఏంటంటే టెండర్ల ద్వారా వచ్చిన పనులను ఈ పక్క జిల్లా కాంట్రాక్టర్ తాను చేయడు.బినామీలకు అమ్ముకొని సొమ్ములు జేబులో వేసుకుంటాడు. ఇది బహిరంగ రహస్యమే అయినా, అధికారులు ఏం చేయలేకపోతున్నారు. మంత్రి, ఆయన సతీమణి ఏ కార్యక్రమంలో ఉన్నా ఈ కాంట్రాక్టర్ అక్కడ ఉండి ఫోటోలు దిగుతుంటాడు సదరు ఫోటోలను చూపించి అధికారుల వద్ద పనులు చేయించుకుంటున్నాడు. ఎప్పటినుంచో ఖమ్మం కార్పొరేషన్ లో ఖమ్మం కు చెందిన కాంట్రాక్టర్లు పనులు చేస్తుండగా ఈ కాంట్రాక్టర్ పక్క జిల్లా నుండి వచ్చి మంత్రి పేరు చెప్పి అధికారులను బెదిరించడం స్థానిక కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పనులు దక్కించుకొని.. కొన్నిటిని బినామీలకు అమ్ముకొని..
పనులు దక్కించుకున్న పక్క జిల్లా కాంట్రాక్టర్ వాటిలో కొన్ని పనులను బినామీలకు అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అనుభవం లేని బినామీలు నాసిరకంగా పనులు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్ కైకొండాయి గూడెంలో రూ 1.50కోట్ల వ్యయంతో సీ సీ రహదారుల నిర్మాణానికి మూడు శాతం లెస్ తో పనులు దక్కించుకున్నాడు, రెండో డివిజన్ పాండురంగాపురం లో రూ 50 లక్షల తో నిర్మించే సీసీ రోడ్డు డ్రైను నిర్మాణానికి మూడు శాతం లెస్ తో కాంటాక్ట్ పొందాడు, డివిజన్ నెంబర్ 17 లో సీసీ రోడ్లు డ్రైనిర్మాణం రూ 50 లక్షలతో చేపట్టేందుకు పనులు దక్కించుకున్నాడు, కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ నుండి 51 డివిజన్ వరకు సిసి రోడ్డు డ్రైన్ నిర్మాణానికి ఏకంగా కోటి రూపాయలు పని తక్కువ లెస్ కే దక్కించుకున్నాడు, 59, 60 డివిజన్లో సిసి రోడ్లు డ్రైన్ నిర్మాణాలు చేపట్టేందుకు ఏకంగా రూ 1.5 0 కోట్లు పనిని దక్కించుకున్నాడు.
ఇంకా పలు డివిజన్ల లో వేరువేరు పనుల నిమిత్తం సుమారు కోటి రూపాయల విలువైన పనులను పక్క జిల్లా కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అయితే తాను పొందిన పనుల్లో ఎక్కువ భాగం బినామీలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కేఎంసీ కమిషనర్ పక్క జిల్లా కాంట్రాక్టర్ చేస్తున్న పనులపై పర్యవేక్షణ చేస్తే అసలు గుట్టు బయటపడుతుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
పనులు చేయకపోతేనే తనిఖీ లు నిర్వహిస్తాం : డ్రాయింగ్ బ్రాంచి ఇంచార్జ్ నవ్య జ్యోతి
అభివృద్ధి పనులకు టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు పనులు చేయకపోతేనే తనిఖీలు నిర్వహిస్తామని డ్రాయింగ్ బ్రాంచి ఇంచార్జ్ నవ్య జ్యోతి పేర్కొన్నారు పనులు నిబంధనల ప్రకారం చేస్తుంటే సదరు కాంట్రాక్టర్ చేస్తున్నాడా, సూపర్వైజర్ ఉంటున్నారా, వేరే వ్యక్తులు చేస్తున్నారా అన్న విషయం విచారణ చేయమన్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్ నిబంధనలను పాటిస్తూ నాణ్యతగా సకాలంలో పనులు పూర్తిచేస్తేనే బిల్లులు చెల్లిస్తామన్నారు.






