- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధునిక సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి
ఏఐ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ సూచించారు.

దిశ, నర్సాపూర్ : ఏఐ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ సూచించారు. బీవీఆర్ఐటి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న " అస్త్ర 2.0 (ASTHRA 2.0) 2026" జాతీయ స్థాయి ఇంజనీరింగ్ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ.. తరగతి గది జ్ఞానాన్ని ప్రాక్టికల్ ఇన్నోవేషన్‌గా మలచాల్సిన అవసరాన్ని వివరించారు. యువ ఆవిష్కర్తలకు ఐఐటీ హైదరాబాద్ ఎల్లప్పుడూ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక విజ్ఞానాన్ని ప్రయోగిక ఇంజనీరింగ్ ఆవిష్కరణలుగా మార్చే అద్భుత వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా.సంజయ్ దూబే మాట్లాడుతూ కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన జాతీయ స్థాయి పోటీలు నిత్యం తమ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల ప్రధాన ఆకర్షణలుగా రియాక్ట్-ఓ-కార్ , టెక్-ఓ-కార్ క్యూబ్ ఎక్స్ పోటీలో నిలిచాయి. మొదటి రోజు కార్యక్రమాల్లో అనంతరం ప్రిన్సిపల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా రియాక్ట్-ఓ-కార్ పోటీకి సంబంధించిన భద్రతా తనిఖీలు విజయవంతంగా నిర్వహించగా, టెక్-ఓ-కార్ మరియు క్యూబ్ ఎక్స్ పోటీలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి మొత్తం 24 బృందాలు ఈ పోటీలలో పాల్గొంటున్నాయనీ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కళాశాల అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బాపిరాజు, సురేష్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






