- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీన విడుదల కానున్న 'మెగా 158' గ్లింప్స్
'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రస్తుతం 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తికాగా, అది విజయవంతంగా ముగిసినట్లు మేకర్స్ ప్రత్యేక వీడియో విడుదల చేసి ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.






