నటిగా నాకు ఈ పాత్ర ఎంతో సంతృప్తిని ఇచ్చింది.. సవాలుగా తీసుకుని ఆ సీన్ చేశా: కియారా అద్వానీ

by Mallepaka Hamsa |

ఆ రోజు ఉదయం నేను ఎప్పటిలాగే షూటింగ్ సెట్‌కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ నా చేతిలో సరికొత్త కన్నడ డైలాగ్స్ స్క్రిప్ట్ పెట్టారు.

నటిగా నాకు ఈ పాత్ర ఎంతో సంతృప్తిని ఇచ్చింది.. సవాలుగా తీసుకుని ఆ సీన్ చేశా: కియారా అద్వానీ
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కియారాతో పాటు నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గోవా బ్యాక్‌డ్రాప్‌లో 1950 నుంచి 1970 మధ్య కాలంలో సాగే డ్రగ్స్ కార్టెల్ మాఫియా నేపథ్యంలో రాబోతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్నప్పటికీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ఈ సినిమాను ఆగస్టు 26న తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటన పరంగా తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ ఈ సినిమాలో ఉండబోతోందని, ఒక నటిగా తనకు ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిన రోల్ అని ఆమె వెల్లడించారు.

ఆ సీన్ వెనుక తాను పడిన కష్టాన్ని ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. "ఆ రోజు ఉదయం నేను ఎప్పటిలాగే షూటింగ్ సెట్‌కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ నా చేతిలో సరికొత్త కన్నడ డైలాగ్స్ స్క్రిప్ట్ పెట్టారు. అవి చిన్న లైన్స్ కావు.. ఏకంగా రెండు మూడు పేజీల నిడివి ఉన్న భారీ డైలాగ్స్. నాకు కన్నడ భాషపై అంతగా పట్టు లేకపోయినా, సవాలుగా తీసుకుని సెట్‌లోనే ఆ లైన్స్ అన్నీ లైన్ టు లైన్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కెమెరా ముందుకు వెళ్లి సింగిల్ టేక్‌లోనే ఆ సీన్ పూర్తి చేశాను" అని కియారా చెప్పారు. నిజానికి ఆ సీన్ షూట్ చేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నప్పటికీ, కష్టపడి కేవలం ఒకే రోజులోనే పూర్తి చేశామని ఆమె అన్నారు. ఈ సినిమాలో తాను చేసిన ఈ వైవిధ్యమైన ప్రయత్నానికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం తాను ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న అతిపెద్ద థియేట్రికల్ రిలీజ్ ఇదేనని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు.

Next Story