- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు.. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్తగా అదనపు న్యాయమూర్తులు నియామకమయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court)కు ముగ్గురు కొత్తగా అదనపు న్యాయమూర్తులు(Additional Judges) నియామకమయ్యారు. న్యాయవాదులు సునీత గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ విశేష సేవలందిస్తున్నారు. దీంతో వారిని హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కేంద్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నియామకాలపై ద్రౌపది ముర్ము ఆమోదముద్ర
అంతేకాదు వీరి నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తయింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను తొలుత కేంద్ర న్యాయశాఖ పరిశీలన చేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు న్యాయమూర్తులు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయసేవలు మరింత సులభంకానున్నాయి.






