- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల జాబితా సవరణ పై అవగాహన సదస్సు
by Jakkula.Mamatha |
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ పై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

X
దిశ, చౌటుప్పల్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ పై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సులకు మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామా తదితర వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని సకాలంలో సవరించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story






