ప్రధాని మోడీ స్పెషల్ రిక్వెస్ట్‌.. ‘సంతూర్‌’ వాయించిన జపాన్‌ పీఎం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-03 06:45:13  IST  )

భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఆతిథ్యమిచ్చారు.

ప్రధాని మోడీ స్పెషల్ రిక్వెస్ట్‌.. ‘సంతూర్‌’ వాయించిన జపాన్‌ పీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో జపాన్ నూతన ప్రధాని సనాయె తకాయిచి (Sanae Takaichi) పర్యటన ఆహ్లాదకరంగా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా దౌత్యపరమైన చర్చల అనంతరం, ఢిల్లీలోని చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్‌ (Hyderabad House)లో జపాన్ ప్రధానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఘనంగా విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఓ అద్భుతమైన సాంస్కృతిక దృశ్యం ఆవిష్కృతమైంది. విందు అనంతరం ఇరు దేశాల ప్రతినిధుల సమక్షంలో భారతీయ సాంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరిగాయి.

ఈ ప్రదర్శనలో భారతీయ శాస్త్రీయ వాయిద్యమైన సంతూర్ (Santoor Instrument) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ.. జపాన్ ప్రధాని తకాయిచిని వేదికపైకి ఆహ్వానించి, స్వయంగా ఆ సంతూర్ వాయిద్యాన్ని వాయించి చూడాలని కోరారు. తొలుత సరికొత్తగా ఉన్న వాయిద్యాన్ని చూసి ఆమె కాస్త సంకోచించి ఇబ్బంది పడ్డారు. అయితే, ప్రధాని మోదీ చొరవ తీసుకుని ఆ వాయిద్యపు స్టిక్స్‌ను చేతిలోకి తీసుకుని దానిని ఎలా వాయించాలో స్వయంగా ఆమెకు చేసి చూపించారు. ప్రధాని మోదీ వివరించిన విధానాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకున్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచి.. వెంటనే సంతూర్ స్టిక్స్ అందుకుని ఆ వాయిద్యాన్ని లయబద్ధంగా వాయించారు. జపాన్ ప్రధాని భారతీయ వాయిద్యాన్ని అంత చక్కగా వాయించడాన్ని చూసి ప్రధాని మోదీతో పాటు అక్కడున్న ఇరు దేశాల ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు చప్పట్లతో అభినందించారు.

Next Story