భవిష్యత్ ఉద్యోగావకాశాలకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం

by Jakkula.Mamatha |

విద్యార్థినులకు భవిష్యత్ ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కృత్రిమ మేధస్సు నైపుణ్యాలపై ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

భవిష్యత్ ఉద్యోగావకాశాలకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం
X

దిశ, ఖమ్మం రూరల్: విద్యార్థినులకు భవిష్యత్ ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కృత్రిమ మేధస్సు నైపుణ్యాలపై ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ శ్రీ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థులు అలవర్చుకుంటే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.గోపాల్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాల పై విస్తృత ప్రభావం చూపుతోందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ఆధునిక నైపుణ్యాలను పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. కు చెందిన డా. సునీత పి. అష్టికర్ మాట్లాడుతూ, నేటి విద్యా వ్యవస్థలో జ్ఞానంతో పాటు పరిశోధన దృక్పథం, ఆవిష్కరణాత్మక ఆలోచన, సాంకేతిక నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు పరిశోధన, శిక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

శిక్షణా సంస్థ వ్యవస్థాపకురాలు డా. నీరజ రెడ్డి మాట్లాడుతూ.. నేటి ప్రపంచంలో విద్య అనేది కేవలం పట్టాలకే పరిమితం కాకుండా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రక్రియగా మారిందన్నారు. శిక్షకుడు శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు కేవలం విద్యార్హతల ఆధారంగా కాకుండా నైపుణ్యాల ఆధారంగా నిర్ణయించబడతాయని తెలిపారు. ముఖ్యంగా ప్రశ్న నిర్మాణ నైపుణ్యం, కృత్రిమ మేధస్సు సాధనాల వినియోగం, సమాచార విశ్లేషణ, స్వయంచాలక ప్రక్రియలపై పట్టు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ ఎ.వెంకటరమణ, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

Next Story