‘దిశ’ కథనానికి స్పందన.. సరిహద్దు వివాదాస్పద గ్రామాలను సందర్శించిన ఆర్డీవో

by Jakkula.Mamatha |

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలైన పరంధోళి కోట, పరంధోళితండా, లేండిగూడ, శంకర్ లొద్ధి, ముకద్ధంగూడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తాలేరనీ, అధికారులు ఇచ్చిన SIR ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేందుకు నిరాకరించారు.

‘దిశ’ కథనానికి స్పందన.. సరిహద్దు వివాదాస్పద గ్రామాలను సందర్శించిన ఆర్డీవో
X

దిశ, ఆసిఫాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలైన పరంధోళి కోట, పరంధోళితండా, లేండిగూడ, శంకర్ లొద్ధి, ముకద్ధంగూడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తాలేరనీ, అధికారులు ఇచ్చిన SIR ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేందుకు నిరాకరించారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు గ్రామస్తులతో చర్చలు జరిపిన వినిపించుకోలేదు. ఈ క్రమంలో గ్రామస్తులు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి తమకు భూ హక్కులు కల్పించాలని. తాము మహారాష్ట్రలో భాష ప్రాతిపదికన మహారాష్ట్రలోనే కొనసాగుతామని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు ఎటు వైపు అని ‘దిశ’ పత్రికలో బుధవారం ప్రచురించిన ప్రత్యేక కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ నాగార్జున ఆ గ్రామాలను సందర్శించి.. గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి మీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో SIR సర్వేకు ఓకే చెప్పారు. అలాగే మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు కూడా గ్రామాలను సందర్శించి ఎస్ఐఆర్ ఫారాలు వారికి అందజేశారు. దీంతో రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఫారాలు నింపుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

Next Story